Jul 10, 2022, 10:55 AM IST
పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ గిరిజన మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. కురుపాం మండలం రాముడుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక రాములమ్మ పురిటినొప్పులతో శనివారం పార్వతీపురం జిల్లా హాస్పిటల్ లో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేయగా ముగ్గురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు.