Feb 13, 2021, 12:08 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అరకులోయలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లిన హైదరాబాదీల టూరిస్టు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదం 8 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని ఎస్ కోట ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు 80 అడుగుల లోతు లోయలో పడింది. ప్రమాదానికి గురైన బస్సు షేక్ పేటకు చెందిన దినేష్ ట్రావెల్స్ కు చెందింది. ప్రమాద వివరాల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. వివరాలకు 08912590102, 08912590100 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.