Nov 15, 2019, 3:08 PM IST
ప.గో.జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద గడ్డి ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నపేటకు చెందిన కోనపాముల శ్రీను, సుబ్బారావు, శివ అనే ముగ్గురు యువకులు మృతి చెందారు.