Nov 19, 2019, 4:52 PM IST
కృష్ణా జిల్లా, నూజివీడు మండలం సీతారాంపురం వద్ద లిఫ్ట్ అడిగి 36 లక్షల విలువచేసే టిప్పర్ ని చోరీ చేసిన దొంగని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయి కోరం అనిల్ కుమార్ అలియాస్ అనిల్ పై గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లో 10 కేసులు ఉన్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. అనిల్ కి గత 18 సంవత్సరాలుగా నేర చరిత్ర ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు.