అల్లం లోడ్ చాటున భారీగా గంజాయి స్మగ్లింగ్... గన్నవరం పోలీసులకు చిక్కిన స్మగ్లర్లు

Apr 7, 2022, 9:36 AM IST

బొలేరో వాహనాన్ని పోలీసులు ఆపగానే డ్రైవర్ సెల్వం మనోజ్ పరారయ్యాడు. అదే వాహనంలో ఉన్నమరో వ్యక్తి వెంకటేషన్ కార్తీక్ మాత్రం పట్టుబడ్డాడు. కొద్దిసేపటికే స్థానికుల సహాయంతో పరారైన డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లం లోడుతో ఉన్న వాహనంలో 530 కేజీల గంజాయి ఉందని... అందుకే తాను పారిపోయినట్లు మనోజ్ అంగీకరించాడు. దీంతో గంజాయితో పాటు బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిపై కేసు నమోదు చేసినట్లు గన్నవరం డిఎస్పీ వెల్లడించారు.