గుంటూరులో పట్టపగలే దొంగతనం... పారిపోతూ ప్రమాదానికి గురయిన దొంగ

Apr 4, 2022, 4:47 PM IST

గుంటూరు: గుంటూరులో పట్టపగలే ఓ దోపిడీ దొంగ రెచ్చిపోయాడు. బ్రాడిపేటలోని ఇండియన్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకొని బ్యాగులో పెట్టుకుని వెళుతున్న వ్యక్తిని వెంబడించిన దొంగ జనాలు తక్కుువగా వుండే ప్రాంతంలో కారంపొడి చల్లి డబ్బుల సంచిని లాక్కుని పరారయ్యాడు. ఇలా లక్షా 80వేల రూపాయలు దొంగిలించి పారిపోతూ కంగారులో అరుండల్ పేట బ్రిడ్జి పైనుంచి క్రింద పడిపోయాడు దుండగుడు. దీంతో వెంబడిస్తున్న వారికి ఈ ఘరానా దొంగ చిక్కాడు. అతడిని పట్టుకుని దేహశుద్ది చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.