విశాఖ తీరంలో మళ్లీ రింగువలల వివాదం... ఏడు పడవలకు నిప్పంటించిన మత్స్యకారులు

Jul 29, 2022, 4:54 PM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి మత్స్యకారుల మధ్య రింగ్ వలల వివాదం రాజుకుంది. సాంప్రదాయ, రింగ్ వలల మత్స్యాకారుల మధయ వివాదం రేగడంతో విశాఖ తీరంలో అలజడి రేగింది. రింగు వలలను వినియోగిస్తున్నారని అనుమానిస్తూ సముద్రంలో లంగరు వేసి ఉన్న ఆరు తెప్పలతో పాటు వలలకు పెద జాలారీపేట, కొత్త జాలారీపేటకు చెందిన సాంప్రదాయ మత్స్యకారులు నిప్పుపెట్టారు. ఇది గమనించిన  జాలారి ఎండాడ,వాసవానిపాలెం మత్స్యకారులు మంటలు ఆర్పారు. ఈ పని చేసింది పెద జాలారీపేట మత్స్యకారులేనని అనుమానిస్తూ వారి మూడు మర పడవలను వాసానిపాలెం తీసుకెళ్ళారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

మత్స్యకార గ్రామాల వివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇరు వర్గాల వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో మత్స్యకార గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.