Aug 27, 2021, 6:04 PM IST
గుంటూరు జిల్లా రాజుపాలెం మండల రెడ్డిగూడెం ఈద్గా వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈద్గా స్ధలంలో రైతు భరోసా కేంద్రం, కమ్యూనిటీ హల్ ఏర్పాటుకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను ముస్లిం నాయకులు, స్ధానికులు అడ్డుకున్నారు.
ఈద్గాకు సంబంధించిన సర్వే నెంబర్ 224లో రెండు ఎకరాల స్థలంలోని కొంత భాగంలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ స్థలంలో కార్యాలయాల ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. స్థానికుల ఆందోళనలతో ఈద్గా వద్ద పోలీసులు భారీగా మొహరించారు.