Jul 26, 2022, 12:11 PM IST
అమరావతి : విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు టీడీపీ ఎస్సి సెల్ దళిత గర్జన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు,దళితులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత గర్జన కు వస్తున్న దళితులను ఎక్కడికి అక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు.