Oct 26, 2022, 2:40 PM IST
శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్. పేట మండలం కృష్టాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టిడిపి వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. టిడిపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆధార్ నమోదు కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఏడుగురికితీవ్ర గాయాలయ్యాయి. వీరిని విశాఖ కెజి హెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.