Sep 11, 2022, 4:00 PM IST
గుడివాడ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుటుంబంపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన తీవ్రవ్యాఖ్యలను తప్పుబడుతూ టిడిపి నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రిపై గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టిడిపి నాయకులు సిద్దమయ్యారు. ఇందుకోసం గుడివాడ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి బయలుదేరిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు వర్ల రామయ్య, నెట్టెం రఘురాం లను పామర్రు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిడిపి నాయకులు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులకు, టిడిపి శ్రేణులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది.