Feb 8, 2021, 7:13 PM IST
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా గుంటూరు వంటి సరిహద్దు రాష్ట్రాల్లోకి అక్రమ మద్యం యదేచ్చగా సరఫరా అవుతోంది. ఇలా ఇవాళ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో భారీ అక్రమ మద్యం పట్టుబడింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 130 కేసుల అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
దాచేపల్లి మండలంలోని అలుగుమిలిపాడు గ్రామ సమీపంలో ఉన్న నిల్వచేసిన 72 కేసుల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు గురజాల డిఎస్పి జయరామ్ ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.