మహిళా కమీషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత... వాసిరెడ్డి పద్మతో అనిత వాగ్వివాదం

Apr 27, 2022, 1:32 PM IST

మంగళగిరి: విజయవాడ ప్రభుత్వాస్పత్రికి అత్యాచార బాధితురాలి పరామర్శ సమయంలో చోటుచేసుకున్న పరిణాలపై టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమను బుధవారం మహిళా కమీషన్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమీషన్ కార్యాలయ ముట్టడి చేపట్టారు. ఈ  నిరసనల్లో టిడిపి మహిళా నాయకురాళ్లతో పాటు విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.  తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.  ఈ క్రమంలోనే మహిళా కమిషన్ ఛాంబర్ లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత వాగ్వాదం జరిగింది. ''జగన్ పాలనలో ఊరికో ఉన్మాది'' అంటూ టిడిపి ప్రచురించిన పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందించారు. ఇప్పటివరకు 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని అనిత ప్రశ్నించారు. పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానన్న కమిషన్ చైర్ పర్సన్ పద్మ తెలిపారు.