నరసరావుపేటలో ఉద్రిక్తత... వైసిపి సర్పంచ్ అభ్యర్ధిపై టిడిపి శ్రేణుల దాడి

Feb 4, 2021, 3:08 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో రెండో విడతలో ఎన్నికలు జరిగే పంచాయితీలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పలుచోట్ల అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి శ్రేణుల మధ్య అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం నామినేషన్ వెయ్యడానికి వెళ్లిన తమ చేతుల్లోంచి వైసిపి వర్గీయులు నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేసినట్లు టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. వైసిపి శ్రేణులు దౌర్జన్యం చేస్తున్నారంటే టిడిపి నాయకులు ఆందోళనకు దిగడంతో నామినేషన్ కేంద్ర వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.ఇదే నరసరావుపేట మండలం అరవపల్లిలో వైసిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్ది వెంకట్రావుపై కొందరు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి టిడిపి వర్గీయులే చేశారంటూ వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.  ఈ దాడిలో వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు నరసరావుపేట రూరల్ పోలీసులు.