‘జాబ్ రావాలంటే..జగన్ పోవాలి’.. జాబ్ క్యాలెండర్ పై టీడీపీ నిరసన..

Sep 15, 2022, 11:25 AM IST

అమరావతి : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జాబ్ ఎక్కడా.. జగన్ ఎక్కడా.. అంటూ అసెంబ్లి వద్ద టీడిపి నిరసన చేపట్టింది. జాబ్ కావాలి అంటే జగన్ పోవాలని టీడిపి ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం సమస్య పెరిగింది. ఎపిలో రైతుల ఆత్మహత్యతో పాటు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తానని జాబ్ క్యాలెండరు విడుదల చేయలేదు. ఎన్నికల ముందు ప్రకటిస్తామన్నా మెగా డిఎస్సీ ఏమైంది.పోలిసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదు. నిరుద్యోగ యువతకు బాసటగ టీడిపి ఉంటుందంటూ.. నేతలు ప్రకటించారు. ఈ ర్యాలీలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ కూడా పాల్గొన్నారు.