Aug 19, 2022, 11:39 AM IST
శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీలో అక్రమంగా నిర్మించారంటూ 52ఇళ్లను రెవెన్యూ సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలకు సిద్దపడ్డారు. అయితే ఇలా కూల్చివేస్తున్న ఇళ్లన్ని టిడిపి నాయకులు, వారికి సంబంధించిన వారివేనని... వైసిపి ప్రభుత్వం కక్షతోనే ఇళ్ల కూల్చివేతకు దిగిందంటూ టిడిపి నాటియకులు ఆరోపించారు. ఇళల కూల్చివేతను అడ్డుకున్న టిడిపి నాయకులు అర్థరాత్రి ఆందోళనకు దిగారు.
ఇచ్చాపురం టిడిపి ఎమ్మెల్యే బెందాలం అశోక్ పార్టీ శ్రేణులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. టిడిపి, వైసిపి నాయకులు అక్కడికి భారీగా చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేసారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎమ్మెల్యే అరెస్ట్ కు సిద్దమయ్యారు. ఎమ్మెల్యేను బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి అక్కడినుండి తరలించారు.