Feb 2, 2021, 1:07 PM IST
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ తో రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన అరెస్ట్ తో టిడిపి శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బెందాళం అశోక్ లు కూడా అచ్చెన్న అరెస్ట్ పై స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం, పోలీసులకు విరుచుకుపడ్డారు.