టీడీపీ నిరాహార దీక్ష : కేసీఆర్ ని చూసి జగన్ బుద్ది తెచ్చుకోవాలి..

Apr 20, 2020, 1:53 PM IST

టీడీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. పేదలకు ఐదువేలరూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండారు మాట్లాడుతూ మౌన దీక్ష చేస్తున్నాం. మేము నలుగురు మాత్రమే చేస్తున్నాం. ఇంట్లో చేస్తే కార్యకర్తలు వచ్చేస్తున్నారనే ఉద్దేశ్యం తో పార్టీ కార్యాలయంలో చేస్తున్నాం అన్నారు. ప్రతి రోజూ టీడీపీ నాయకులం అంతా సేవలో వున్నాం. వైసీపీ పార్టీ రంగులు మార్చమని కోర్టు చెప్పినా బేఖాతర్. అన్నా క్యాంటీన్ లు ఎందుకు మూసేశారని అడిగారు. పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితి లలో కేసీఆర్ ని చూసి కూడా మన ముఖ్యమంత్రి కి బుద్ధి రావడం లేదని విరుచుకుపడ్డారు.