Apr 20, 2020, 6:54 PM IST
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఈరోజు పోలీసుల దెబ్బలకు చనిపోయిన గౌస్ మృతదేహాన్ని చూడడానికి టీడీపీ నేత రాయపాటి రంగబాబు ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన పోలీసులు క్రమశిక్షణ పాటించాలని అన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం 25లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.