ప్యాక్షనిస్ట్ జగన్ సోషలిస్ట్ అవుతాడా... ముస్సోలినిలా ఫాసిస్ట్ అవుతాడు..: యనమల సంచలనం

Oct 27, 2022, 6:18 PM IST

గుంటూరు : బిసీల ఆస్తులను దిగమించిన వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో బిసీల సభ నిర్వహించడం దారుణమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సీఎం జగన్ బీసీలకు చేస్తున్న ద్రోహానికి నిలువెత్తు నిదర్శనమే ఈ సభ అంటూ మండపడ్డారు. గతంలో టిడిపి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని బీసీలకు ఇస్తే... వైసీపీ ప్రభుత్వం రెడ్లతో నింపిందన్నారు. ఇంతకాలం సాగిన జగన్ రెడ్డి పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారని అన్నారు. 

సీఎం జగన్ ను ఇటలీ మాజీ అధ్యక్షుడు ముసోలినీతో పోల్చాడు యనమల. జగన్ కుటుంబం ప్యాక్షన్ రాజకీయాలు చేసిందని... అలాంటిది ఆయన సోషలిస్ట్ ఎలా అవుతారని నిలదీసారు. ముసోలిని కూడా ఇలాగే మొదట సోషలిస్ట్ అని చెప్పుకునేవాడని... ఒక్కసారి ఇటలీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో ఫాసిజాన్ని ప్రవేశపెట్టాడన్నారు. జగన్ కూడా ముస్సోలినికి ఏమాత్రం తీసిపోని విధంగా తన ఫాసిస్టు మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని యనమల  ఆరోపించారు.