Apr 6, 2023, 2:06 PM IST
'ఎన్నికల ముందు మూడు దఫాల్లో మద్య నిషేధం అన్నావు కదా ఇప్పుడు ఏమంటావు ..?' అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం. బ్యాంకులకు మందుబాబులను 15 ఏళ్లు కుదవ పెట్టారంటూ ఆయన ఆరోపణలు చేసారు. మద్యం రేట్లను మూడు రెట్లు పెంచి మందుబాబుల సంపాదన లాక్కుంటున్నారంటూ ఆయన ఆక్షేపించారు. 'నాలుగేళ్ల సీఎం జగన్ రెడ్డి మద్యం దోపిడీ 41 వేల కోట్లు మధ్య0 విక్రయాల్లో కొట్టేసిన కమిషన్ 28 వేల కోట్లు' అంటూ ఆరోపణలు చేసారు.