పంచాయితీ ఎన్నికలు... ఆ పోలీస్ అధికారులను బదిలీ చేయండి: ఎస్ఈసీకి బోండా డిమాండ్

Feb 1, 2021, 5:24 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి నాయకులు బోండా ఉమ ఆరోపించారు.  కాబట్టి ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారికి సూచించారు. ముఖ్యంగా స్థానిక నాయకులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరించకుండా బదిలీలు చేపట్టాలని బోండా సూచించారు. అలాగే మరికొన్ని సూచనలు కూడా ఎస్ఈసీకి చేశారు బోండా ఉమ.