Aug 7, 2020, 10:23 AM IST
మూడు రాజధానుల వలన ఎక్కువ నష్టపోయేది రాయలసీమ ప్రాంత వాసులే అంటూ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ మండిపడ్డారు. జ్యూడిషియల్ క్యాపిటల్ అని చెపుతూనే విశాఖపట్నంకి, విజయవాడకి హైకోర్టు బెంచ్ ఇచ్చారు. మరి ఏ విధంగా రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ అవుతుందంటూ ప్రశ్నించారు. మాకు హైకోర్టు ఇస్తున్నారంటే పార్టీలకు అతీతంగా మేము స్వాగతిస్తాం కానీ హైకోర్టుతో పాటు ఆగిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్ లు పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి రాయలసీమలో ఉన్న విద్య సంఘాలు, రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే రాయలసీమలో వైస్సార్సీపీ నాయకులు నోరు విప్పకపోవడం అన్యాయం అంటూ విరుచుకుపడ్డారు.