కరోనా పేషంట్లకు పెట్టే ఫుడ్ లో కూడా కమిషన్లు.. అయ్యన్నపాత్రుడు

Apr 29, 2020, 4:49 PM IST


ఏపీలో చేతకాని, పనికిమాలిన ముఖ్యమంత్రి వలన కరోనా విజృంభిస్తోందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఏపీలో కరోనాను కట్టడి చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని పక్క రాష్ట్రాల వారికి కూడా తెలిసింది. ఏపీ వాళ్లు రావడానికి వీల్లేదని తమిళనాడు వారు గోడ కట్టేశారు. కర్ణాటక వారు కూడా అడ్డుగా గోడ కట్టేశారు. గ్రామాల్లోనూ కంచెలు వేసేశారు. ఒక గ్రామం నుంచి ఒక గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందంటే అందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతే కారణం అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు.