Apr 10, 2020, 10:17 AM IST
కృష్ణ జిల్లా, మచిలీపట్నం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారును పోలీసు అధికారులు సీజ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి క్వారంటైన్ సందర్శనకు వెళుతున్న కొల్లు రవీంద్రని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కొల్లు రవీంద్రకు చిన్నపాటి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఐపీసీ సెక్షన్ 188 మరియు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1987 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు.