Apr 20, 2022, 2:13 PM IST
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ 73 పడిలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బుధవారం (ఎప్రిల్ 20) తన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. ఇవాళ ఉదయమే ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి దేవినేని ఉమ, బుద్ధా వెంకన్నతో కలిసి చంద్రబాబు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ప్రతిపక్ష నేతకుఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు దగ్గరుండి చంద్రబాబుకు అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలు చేయించారు. దర్శనానంతరం వైదిక కమిటీ సభ్యులు చంద్రబాబు వేద ఆశీర్వచనం అందించగా ఈవో భ్రమరాంబ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేసారు