Mar 2, 2022, 5:03 PM IST
గుంటూరు: సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగాయి. యడ్లపాటి అంతిమయాత్రలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పాల్గొని స్వయంగా పాడెమోసారు. అంతకుముందు అంతిమ క్రతువులో చంద్రబాబుతో పాటు టీడీపీ సీనియర్ నేతలు పాల్గొని యడ్లపాటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. టిడిపి జెండా యడ్లపాటి పార్థివ దేహంపై ఉంచిన చంద్రబాబు అంజలి ఘటించారు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని స్మశాన వాటికలో యడ్లపాటి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెనాలిలోని మంచి స్మశాన వాటిక కు సాగిన అంతిమయాత్రలో చంద్రబాబు కాలినడకన పాల్గొన్నారు.