Apr 23, 2020, 11:36 AM IST
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేట ప్రాంతాన్ని పోలీసులు పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజల రాకపోకలు ఆపేశారు. ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసు వచ్చి దీన్ని హాట్ స్పాట్ గా చేసినా, ఇక్కడి ప్రజలకు ఎన్ని సార్లు చెప్పినా వినకుండా బహిరంగంగా రోడ్లపై తిరుగుతున్నారని రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. దీన్ని ఉల్లంఘిస్తే కఠినచర్యలుంటాయని తాడేపల్లి ఎస్సై భార్గవ్ తెలిపారు.