Jun 14, 2022, 4:55 PM IST
తాడేపల్లి: కాసులపై కక్కుర్తితో చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కృష్ణా నదినే స్విమ్మింగ్ పూల్ గా మార్చిందో ముఠా. ఓవైపు చిన్నారుల ఈత సరదాతో నీటమునిగి ప్రాణాలు కోల్పోయిన అనేక ఘటనలు చోటుచేసుంటున్న వేళ ఏ మాత్రము అనువుకాని కృష్ణానదిలో చిన్నారులు, యువతకు స్విమ్మింగ్ కోచింగ్ ఇస్తుందీ ముఠా. మనిషికి రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు నయా దందాకు తెరతీసారు. గుంటూరు జిల్లాలో అందరి కళ్లమందే యధేచ్చగా ఇంత తతంగం జరుగుతున్నా అదికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రాణాలు పోకముందే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద కృష్ణానదిలో జరుగుతున్న ఈ స్విమ్మింగ్ దందాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.