Nov 18, 2019, 4:54 PM IST
కృష్ణాజిల్లా నందిగామలో సుబాబుల్ కొనుగోలులో అన్యాయం చేస్తున్నారంటూ రహదారి దిగ్బంధం చేసి, కంచికచర్ల జాతీయ రహదారి ప్రక్కనున్న సుబాబుల్ కాటా వద్ద రైతులు ఆందోళనకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పారు.