ఆత్మహత్యలకు వ్యతిరేకంగా కదిలిన విద్యార్ధి లోకం

Sep 10, 2022, 4:17 PM IST

ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారం కాదు ధైర్యంగా సమస్యను ఎదుర్కొండంటూ పిలుపునిచ్చారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా.   అనంతరం ఆత్మహత్యలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే పోస్టర్ను ఎస్పీ,అడిషనల్ ఎస్పీ,పోలీస్ అధికారులు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఆత్మహత్యల జోలికి పోవద్దని, అలా పాల్పడితే దాన్ని పర్యవసానాలు తెలిసేలా విద్యార్థులో అవగాహన కల్పించేందుకు తయారుచేసిన లఘు చిత్రాలను ప్రదర్శించారు.  ఆత్మహత్యలు వద్దు... ఆనందమైన జీవితం గడపడానికి కావలసిన మార్గాలను అన్వేషిస్తూ ఆనందంగా జీవిస్తామని విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు.