Sep 3, 2022, 9:28 AM IST
పల్నాడు : పిడుగురాళ్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి వినాయక విగ్రహాలపై పరస్పర రాళ్ల దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పిడుగురాళ్ల ఎస్సై పవన్ కు గాయాలయ్యాయి. వైసిపి, టిడిపి కార్యకర్తలు వినాయక నిమజ్జనానికి విగ్రహాలను ర్యాలీగా తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే చోట ఇరు వర్గాలు ఎదురుపడటంతో గొడవ మొదలయ్యింది. అది కాస్తా రాళ్లు విసురుకోవడం వరకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ దాడిని నిలువరించేందుకు వెళ్లిన పోలీసులకు రాళ్ల గాయాలు అయ్యాయి.