Nov 22, 2019, 10:30 AM IST
శ్రీశైలం డ్యాంకు మరమ్మతులు చేయకపోతే పెను ప్రమాదం తప్పదని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ హెచ్చరించారు. ‘గంగాజల్ సాక్షరత్’ యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు ఏదైనా విపత్తు సంభవిస్తే దాదాపు సగం ఆంధ్ర కనిపించకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర హైడ్రోలిక్ ఒత్తిడి వల్ల నీటి వేగం అధికంగా ఉంటుందని, దీంతో డ్యాం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని వివరించారు. దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.