Aug 16, 2023, 5:57 PM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఏపీలోని ప్రముఖ నగరం విశాఖపట్నంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల, సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ఈ స్కూల్ ఏర్పాటుచేయనున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో నిర్మించనున్న స్కూల్ కు వచ్చేనెలలో శంకుస్థాపన చేయనున్నట్లు... ఆ కార్యక్రమానికి హాజరుకావాలంటూ సీఎం జగన్ ను కోరారు శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిసి ఆహ్వానించారు ట్రస్టీ మెంబర్ సుఖ్‌వల్లభ్ స్వామి, ధర్మ్‌సాగర్ స్వామి. వీరు మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కలిసివెళ్లారు.