Aug 19, 2022, 11:35 AM IST
విజయవాడ : ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ఱా నది ఫెర్రీ ఘాట్ లో పవిత్ర స్నానాలకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటమునిగారు. అయితే వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై ఐదుగురు విద్యార్థుల్ని కాపాడారు. ఓ విద్యార్థి మాత్రం నీటమునిగి గల్లంతవగా గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతయిన బాలుడు లోకేష్ గా గుర్తించారు. విద్యార్థులంతా స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ కు చెందినవారుగా గుర్తించారు.