కరోనావైరస్ : విజయవాడలో 25 పాజిటివ్ కేసులు.. ఆరు రెడ్ జోన్లు..

Apr 10, 2020, 3:34 PM IST

విజయవాడలోని  పాత రాజరాజేశ్వరి పేటలోని రెడ్ జోన్ ను సీపీ ద్వారకా తిరుమల రావు పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి అప్రమత్తం చేశారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడ పరిధిలో 6 ప్రాంతలను రెడ్ జోన్ గా ప్రకటించారు. రెడ్ జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.  ఈ జోన్లలోని ప్రజలెవ్వరూ బైటికి రావద్దని ఇక్కడ ప్రజలు ఫుడ్ సప్లై చేసే వాళ్ళకు మున్సిపల్ కార్పోరేషన్ లో ఒక నెంబర్ ఏర్పాటు చేస్తామని,  రెడ్ జోన్ కి సంబంధించి పోలీస్ శాఖ తరుపున ఒక ఎస్.ఐ, మున్సిపల్ అధికారులు ఉంటారని తెలిపారు. ఫుడ్ సప్లై చేసే ప్రతి ఒక్కరు అనుమతి తీసుకోవాలని లేకపోతే కఠిన శిక్ష వేస్తామని అన్నారు.