Apr 28, 2020, 3:50 PM IST
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయనగరం జిల్లాలోని సీతానగరం డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో పార్వతిపురం నుండి విజయనగరం వైపు రాకపోకలు పూర్తిగా బందయ్యాయి. నడిచి వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మరమ్మత్తుల నిమిత్తం పాత వంతెన మూసి వేశారు. దీంతో నిత్యావసర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.