Aug 7, 2022, 2:54 PM IST
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ శాఖలో భారీగా నియామకాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం ఇవాళ(ఆదివారం) ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష కోసం రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది. గోదావరిఖనిలో రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్షకోసం ఏర్పాట్లు చేసారు. ఎస్సై ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144సెక్షన్ విధించిన పోలీసులు అభ్యర్థులకు క్షుణ్ణంగా పరిశీలించాకే సెంటర్లోని అనుమతించారు.