ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖలో మొరాయించిన సర్వర్లు...

Sep 5, 2022, 2:25 PM IST

విజయవాడ : ఆంధ్రప్రదేశ్  రవాణాశాఖలో సర్వర్లు పని చేయనని మొరయించాయి. సర్వర్ పని చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా సర్వర్ ఇబ్బందులు ఎదురయ్యాయని.. అయినా కూడా  రవాణాశాఖ అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రజలు అంటున్నారు. సర్వర్లు మొరాయించడంతో రవాణాశాఖ ద్వారా నడిచే ఆన్లైన్ సేవలను అన్ని నిలిచిపోయాయి. కొత్తగా డ్రైవింగ్ లైసెన్సు అప్లై చేసుకున్న వారు, వాహనదారులు  సర్వర్లు మొరయించడంతో ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు.