Feb 8, 2021, 5:43 PM IST
విజయవాడ: పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రదానాదికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల గురించి మాట్లాడేందుకే నిమ్మగడ్డ రాజ్ భవన్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికలు, మంత్రుల తీరు, ప్రభుత్వ సహకారం వంటి విషయాలపై ఎస్ఈసీ గవర్నర్ తో మాట్లాడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గవర్నర్ తో ఎస్ఈసీ చర్చలు కొనసాగుతున్నాయి.