Nov 11, 2019, 2:52 PM IST
గుంటూరు జిల్లా, మంగళగిరి ఈద్గాలో అంజుమాన్ సంస్థ వారు నిర్వహించిన పేదముస్లీం విద్యార్థులకు స్కాలర్ షిప్ ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే
ఆర్కే హాజరయ్యారు. అంజుమాన్ సంస్థ తమకు వచ్చిన ఆదాయంలో 25% పేదవిద్యార్థులకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సంస్థ ద్వారా లబ్దిపొందిన పూర్వ విద్యార్థులు రాబోయే కాలంలో ఈ సంస్థకు ఆర్థిక సహాయాన్ని అందించాలని తద్వారా పేద ముస్లీమ్ విద్యార్థుల చదువుకు దోహదపడాలని అన్నారు.