మాజీ మంత్రికి ఈడీ పాదాభివందనం..!!

Apr 9, 2022, 11:45 AM IST

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వామి భక్తి చూపించుకున్నారు. మాజీ మంత్రికి పాదాభివందనం చేశారు. మాజీ మంత్రి పట్ల స్వామి భక్తిని చాటుకునే క్రమంలో కొందరు అధికారులు తమ స్థాయిని విస్మరిస్తున్నారు..ప్రకాశం జిల్లా..పెద్దదోర్నాల లో జరిగిన ఉగాది వాలంటీర్లు సత్కారల కార్యక్రమంలో తాజా మాజీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఎస్సీ కార్పొరేషన్  అధికారి, ఈడీ T. శ్రీనివాస్ విశ్వనాధ్ పాదాభివందనం చేశారు. ఇది సర్వత్రా విమర్శలకు దారి తీసింది.