Jun 2, 2022, 4:44 PM IST
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమంగా మట్టితవ్వకాలు చేపట్టడమే కాదు అడ్డుకోడానికి వెళ్లిన రెవిన్యూ అధికారులను మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారంటే మట్టి మాఫియా సభ్యులు ఎంతలా బరితెగించారో అర్థమవుతుంది. అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గన్నవరం వీఆర్వో, అర్ఐ అడ్డుకునేందుకు వెళితే మీరెవరు ఆపడానికి అంటూ ఎదురుతిరిగారు.