Oct 12, 2022, 2:31 PM IST
కృష్ణా జిల్లాలో ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురవగా తృటిలో పెను ప్రమాదం తప్పింది. 30 మంది ప్రయాణికులతో బీమవరం నుండి విజయవాడకు వెళుతున్న గుడివాడ డిపో ఆర్టిసి బస్సు పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. వెంటనే డ్రైవర్ బస్సును అదుపుచేసి బోల్తా పడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపక్కకు ఒరిగిన బస్సు డోర్ లోంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రయాణికులను డ్రైవర్ సీటు వద్ద గల డోర్ లోంచి బయటకు తీసారు. స్థానికులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.