మందడంలో రెచ్చిపోయిన దొంగలు... సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ (సిసి వీడియో)

Jul 31, 2022, 11:35 AM IST

గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం మందడంలో గత అర్థరాత్రి దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానిక సాయిబాబా గుడిలోని హుండీపై కన్నేసిన కొందరు యువకులు దోపిడీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి రెండు ద్విచక్రవాహనాలపై గుడివద్దకు చేరుకున్న దొంగలు గునపంతో ఆలయ ద్వారాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. సాయిబాబా విగ్రహం ఎదురుగా గల హుండీని ఎత్తుకెళ్ళారు. ఈ దొంగతనం దృశ్యాలు ఆలయంలోని సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇలా దొంగిలించిన హుండీని ఆలయ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పగలగొట్టి అందులోని డబ్బులు తీసుకెళ్లారు. హుండీని అక్కడే వదిలేసారు. ఉదయం ఆలయంలో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆలయాన్ని పరిశీలించి సిసి కెమెరా రికార్డింగ్ ఆదారంగా నిందితులను గుర్తించేపనిలో పడ్డారు.