Feb 8, 2021, 1:04 PM IST
కృష్ణా జిల్లా కొండపల్లి పట్టణంలో ఆర్య వైశ్య కళ్యాణ మండపం సమీపంలోని ఓ ఇంట్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ధార శిరీష నివాసంలోకి తెల్లవారుజామున చోరబడ్డ దొంగలు కుటుంబాన్ని కత్తితో బెదిరించి 300 గ్రాముల బంగారు నగలను అపహరించారు. దొంగలను కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా... డాక్టర్ శిరీషను చంపుతామంటూ గొంతుపై కత్తిపెట్టి బెదించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులను విచారించి చోరీ జరిగిన విధానం గురించి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.