న్యాయం చేయండంటూ మృతదేహంతో హైవే పై బైఠాయించిన మృతుని కుటుంబసభ్యులు

Apr 18, 2023, 4:13 PM IST

పల్నాడు జిల్లా , దాచేపల్లి లోని ఇందిరా కాలనీ వద్ద మొన్న హైవే రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మల్లికార్జునరావు (27) కుటుంభానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ  దాచేపల్లి అద్దంకి నార్కెట్‌పల్లి హైవే పై మృతదేహంతో స్థానికులు దర్నాకు దిగారు. మృతదేహానికి దహనసంస్కారాలు ఇంతవరకు నిర్వహించని మృతుని కుటుంభసభ్యులు , ఇందిరా కాలనీ  వాసులతో కలిసి  తక్షణమే మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైవే పై బైఠాయించారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించాము అంటూ ఆందోళనకు దిగారు.