ఎన్టీఆర్ జిల్లాలో యాక్సిడెంట్... వ్యక్తి మృతి..

Apr 30, 2022, 2:03 PM IST

ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలం.. కంచికచర్ల 65 నెంబర్ బైపాస్ రోడ్డు లో బుల్లెట్ బైక్ యాక్సిడెంట్ అయ్యింది. బుల్లెట్ బైక్ ను గుర్తు తెలియని వాహనం గుద్ధి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో బుల్లెట్ బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందాడు. మృతుడి పేరు తోట భరత్, వయసు 28. తండ్రి శ్రీనివాస రావు, గ్రామం అవనిగడ్డ గా పోలీసులు గుర్తించారు. అతను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నట్టు సమాచారం. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్ లో మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.