Feb 10, 2021, 4:18 PM IST
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని సూరంపల్లిలో బుధవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంగా వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయాపడ్డారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి.