Apr 29, 2020, 10:30 AM IST
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పై గతంలో ఓ కార్యక్రమంలో చెప్పుతో దాడిచేసిన వైఎస్సార్సీపీకి చెందిన మెడిశెట్టి ఇజ్రాయిల్ పై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య ప్రయత్నం చేశారు. కే గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో గల ఓ ప్రదేశంలో పక్కా మాస్టర్ ప్లాన్ తో మారణాయుధాలతో దాడిచేసినట్లు సమాచారం. తీవ్రగాయాలైన మెడిశెట్టి ఇజ్రాయిల్ ను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా పరిస్థితి విషమించడంతో కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే రామచంద్ర పురం డిఎస్.పి రాజగోపాలరెడ్డి, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ఆస్పత్రికి వచ్చివివరాలు తెలుసుకున్నారు. డి.ఎస్.పి మాట్లాడుతూ ఈ సంఘటనలో దోషులను అరెస్టుచేసి తీరుతామని చెప్పారు.